గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జూన్ 2020 (18:50 IST)

పచ్చటి సీమలో కరోనా కల్లోలం : తూగో జిల్లాల్లో ఒకే రోజు 28 కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చటి సీమగా పేరుగాంచిన కోనసీమ జిల్లాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
నిజానికి లాక్డౌన్ సమయంలో ఈ జిల్లాల్లో నమోదైన కేసులు సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ, లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఈ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. 
 
ప్రధానంగా ముంబైతోపాటు.. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల కారణంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో కోనసీమ వాసులు వణికిపోతున్నారు. 
 
తాజాగా నమోదైన 28 కరోనా కేసుల్లో రాజోలు క్వారంటైన్‌లోని 12 మందికి, రావులపాలెంలో ఐదుగురికి, ముమ్మిడివరంలో ముగ్గురికి, అమలాపురంలో ఏడుగురికి, పిఠాపురంలో ఒక నర్సుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసుల కారణంగా కోనసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.