శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 1 జూన్ 2020 (21:52 IST)

కోవిడ్ 19కి వ్యతిరేకంగా సాంకేతిక పరిజ్ఞానం కీలకం

విస్తృతమైన కరోనా మహమ్మారి వలన ప్రపంచం పూర్తిగా దెబ్బతింటోంది. అన్ని జీవన రంగాలు తమ జీవన శైలని మార్చుకోవడమే కాకుండా ఆచార సంప్రదాయాలను బలవంతంగా కట్టడి చేసుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా ఆధారిత సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
 
కరోనా వైరస్ కారణంగా పూర్తిగా అన్ని రంగాల రూపురేఖలు మారిపోయాయి. ఐతే సమాజంలో గల విలువలను వేగవంతమైన మార్పులను తెలుసుకోవడానికి ఇది మార్గమైనది. కరోనా మహమ్మారికి వ్యతిరేఖంగా జరుగుతున్న ఈ పోరాటంలో విజయాన్ని అంతా కలసికట్టుగా సాధించాలి. ఇందుకు సరైన మార్గం సామాజిక దూరం మరియు సాంకేతిక జ్ఞానం అవసరం.