మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (19:10 IST)

బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం.. ముగ్గురు యువకులు గల్లంతు

Ganesh Immersion
బంగాళాఖాతంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ముగ్గురు యువకులు గల్లంతైన విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వాకలపూడి మండలం తూపిలిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో నాయుడుపేటకు చెందిన మునిరాజా, ఫైజ్ ఉన్నారు. 
 
మూడో యువకుడి వివరాలు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తుల కోసం డైవర్లు వెతుకుతూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించి గల్లంతైన యువకుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.