శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:40 IST)

భర్తతో కాకుండా ఒంటరిగా తిరుమలకు వచ్చిన హన్సిక.. కారణం ఏంటి?

Hansika
స్నేహితురాలి భర్త అయిన సొహైల్ అనే వ్యక్తిని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హ‌న్సిక‌కు ఇది మొద‌టి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం ఇది రెండోది. హన్సిక మోత్వాని తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రింకీ మాజీ భర్త సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది.
 
2016లో రింకీతో సోహైల్ కతురియా మొదటి వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహెల్ ఖతురియా హ‌న్సిక‌తో ప్రేమలో పడ్డాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్‌ను కలిసినట్టు హన్సిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. 
 
వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైనట్లు ఆమె తెలిపింది. 2022 డిసెంబర్‌ 4న జైపూర్‌లోని ముండోటా కోట ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో హన్సిక సెప్టెంబర్ 1వ తేదీన శ్రీవారిని దర్శనం చేసుకుంది. బాలనటిగా అదరగొట్టిన ఈ దేశముదురు హీరోయిన్ హన్సికకు ప్రస్తుతం 33 సంవత్సరాలు. 
 
వరుసగా తమిళం, హిందీ, తెలుగు, కన్నడం తదితర భాషల్లో నటిస్తూ వస్తున్న ఈమె సోహాలీ ఖతురియాను వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న హన్సిక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
కానీ తిరుమలకు వచ్చిన హన్సిన వెంట ఆమె భర్త సోహాలీ లేకపోవడం ప్రస్తుతం చర్చకు తావిచ్చింది. భార్య హన్సికతో సోహాలీ ఎందుకు తిరుమలకు రాలేదనే టాక్ నెట్టింట ప్రారంభమైంది.