శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 28 ఆగస్టు 2024 (19:10 IST)

భర్తను మరో మహిళ ఇష్టపడిందని అతడితో పెళ్లి చేసిన భార్య

భర్తపై మరో మహిళ నీడ పడితేనే సహించలేని భార్యలుంటారు. అలాంటి ఈ కాలంలో మరో మహిళ తన భర్తను ఇష్టపడిందని ఏకంగా ఆమెను తీసుకొచ్చి తన భర్తతో వివాహం జరిపించిన ఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లికి చెందిన దాసరి సురేష్, సరితలు దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె సంతానం కూడా వున్నారు. ఐతే ఈమధ్య తన భర్త అంటే అతడి మేనమామ కుమార్తె సంధ్య ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నది. ఇది గమనించిన సరిత భర్తతో మాట్లాడి ఆమెనిచ్చి తన భర్తతో పెద్దల సమక్షంలో గుడిలో పెళ్లి జరిపించింది. అనంతరం మాట్లాడుతూ... సంధ్య మానసిక వికలాంగురాలనీ, మానవతా దృక్పథంతో ఆమె కోరికను తీర్చాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇకపై ఆమె ఆలనాపాలనా తామే చూస్తామని చెప్పింది.