మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (10:14 IST)

తెరాస ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీరియస్ వార్నింగ్... ఎందుకు?

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీ

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన 39 మంది ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇలాగైతే మిమ్మలను ఎవరూ కాపడలేరంటూ హెచ్చరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలకు వారి చేతే చెప్పించారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగా ఆయన ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలిపారు. ఇలా వార్నింగ్ ఎదుర్కొనేవారిలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో చాలా మందికి టికెట్ మిస్ అయ్యే అవకాశం ఉందని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపించారు. 
 
పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో కూడా కొందరు సీనియర్ల పరిస్థితి దారుణంగా ఉందని సమాచారం. వివిధ సర్వేల ద్వారా కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకున్నారు. పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని... వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఇలాగే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరని కేసీఆర్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు.