శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 10 ఆగస్టు 2021 (21:08 IST)

శ్రీవారి మెట్లు మార్గంలో కాలి నడకన వెళ్లి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి

శ్రీవారి మెట్టు మార్గంలో కాలి నడకన తిరుమలకు వెళ్ళారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు. శ్రీవారిమెట్టు వద్ద వైవీ సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో గోపీనాథ్ జెట్టి.
 
రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో 9.45 నిమిషాలకు టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడించారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఈ రెండేళ్ళల్లో ఏదైనా తప్పులు జరిగినా మన్నించాలని శ్రీవారిని వేడుకుంటూ కాలినడక తిరుమలకు వెళుతున్నట్లు వెల్లడించారు. కరోనా నుండి ప్రజలను కాపాడాలని పూజలు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.