Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీలో రెండు కొత్త కోర్సులు

Written By ఎం
Updated: బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (08:50 IST)
వచ్చే విద్యాసంవత్సరం డిగ్రీలో మరో రెండు కొత్త కోర్సులు రానున్నాయి. బీఎస్సీలో డేటాసైన్స్, బీకాంలో బిజినెస్​ అనలైటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టేందుకు గత కొంతకాలంగా హయ్యర్ ఎడ్యుకేషన్​కౌన్సిల్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో డేటాసైన్స్ కోర్సు ఏర్పాటు కోసం కౌన్సిల్ చైర్మన్ పాపిరెడ్డి, వైస్​చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ, ఓయూ మాజీ వీసీ రామచంద్రం, రిజిస్ర్టార్ గోపాల్​రెడ్డి, ప్రొఫెసర్లు ఫాతిమా బేగం, జయశ్రీతో పాటు ఐఐఐటీ, టీసీఎస్, కాగ్నజెంట్ ప్రతినిధులతో కమిటీని వేశారు.

ఆ కమిటీ సమావేశమైంది. వచ్చే ఏడాది బీఎస్సీ డేటాసైన్స్​ను హానర్స్​కోర్సుగా తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి సిలబస్, క్రెడిట్ పాయింట్లపైనా చర్చించారు. గురుకుల విద్యాసంస్థల్లో డేటాసైన్స్​ఆరునెలల కోర్సుగా కొనసాగిస్తున్నారు.

ఇది పూర్తిచేసిన వారిలో ఎక్కువమందికి మంచి కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి. దీంతో ఈ కోర్సును డిగ్రీలో పెట్టాలని ఉన్నత విద్యామండలికి గురుకులాల సెక్రటరీ గతంలో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఉన్నత విద్యామండలి కమిటీ వేసింది.

అలాగే బీకాంలోనూ బిజినెస్​ అనలైటిక్స్​కోర్సుపెట్టాలని మేనేజ్మెంట్ల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ కోర్సుపై కూడా చర్చ జరిగింది. ఇప్పటికే ఈ కోర్సు సిలబస్​ను అధికారులు సిద్ధం చేశారు. ఈ రెండు కోర్సులను ప్రభుత్వ, అటానమస్​ కాలేజీల్లోనే ప్రారంభించాలని నిర్ణయించారు.

వీటితో పాటు అన్ని వసతులున్న ప్రైవేటు కాలేజీలు ముందుకొస్తే, వాటికి కూడా పర్మిషన్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆయా కోర్సులు ప్రారంభించే కాలేజీల్లో సంబంధిత లెక్చరర్లకు ముందుగా ట్రైనింగ్​ ఇవ్వనున్నారు.

అన్నీ చూడండి

Varun Tej: అభిమానుల పట్ల మరోసారి పెద్ద మనసు చాటుకున్న వరుణ్ తేజ్

Sharwa : భోగి కోసం భారీ క్లైమాక్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న శర్వా

Ajay Bhupathi: ఆర్‌ఎక్స్ 100 తర్వాత కొత్త వాళ్లతో పని చేయకూడదనుకున్నా : అజయ్ భూపతి

చిన్నప్పుడు మా మావయ్య ఒడిలో కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు: నటి శివాంగి

Vijay Deverakonda:.హాలీవుడ్ టెక్నీషియన్స్ స్థాయికి ఎదిగిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments