ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 10 అక్టోబరు 2020 (16:49 IST)

నమ్మిన స్నేహితురాలే మోసం చేసింది, మద్యం తాగించి వ్యభిచారంలోకి...?

అసలే కరోనా కష్టకాలం. పని చేయడానికి ఇప్పటికీ చాలాచోట్ల పనులు లేవు. సాఫ్ట్వేర్ లాంటి రంగమే కుదేలైపోయిన పరిస్థితి. దీంతో ఒక యువతి ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలనుకుంది. తనకు పరిచయమైన ఒక యువతిని నమ్ముకుని తిరుపతికి వచ్చింది. కానీ నమ్మిన స్నేహితురాలే మోసం చేస్తుందని ఊహించలేకపోయింది.
 
కరీంనగర్‌కు చెందిన 23 యేళ్ళ యువతి ఖమ్మంలో ఉంటోంది. హైదరాబాద్‌లో కొన్నిరోజుల పాటు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన యువతికి కొంతమంది పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో భాగంగా తిరుపతిలో ఉన్న యువతితో కూడా ఏర్పడింది. 
 
కానీ కరోనావైరస్ కారణంగా ఉద్యోగం పోయి ఎవరికి వారు ఇళ్ళకు వచ్చేశారు. తన ఇంటికి వెళ్ళకుండా యువతి ఖమ్మంలో ఉంటోంది. స్నేహితురాలితో కలిసి ఉంటోంది. అయితే తిరుపతిలో ఉద్యోగం ఉందని.. వస్తే తీసిస్తామని చెప్పింది స్నేహితురాలు.
 
ఆమె మాటలను నమ్మింది. ఖమ్మం నుంచి ఒక వాహనాన్ని మాట్లాడుకుంది. 11 వేలకు బేరం కుదుర్చుకుని తిరుపతికి బయలుదేరింది. స్నేహితురాలితో మాట్లాడుతూ వచ్చింది. తిరుపతికి సమీపంలోని కరకంబాడి దగ్గరకు వచ్చిన వెంటనే స్నేహితురాలు తన బంధువులు ఇంటికి వెళ్ళమని తను వస్తానని చెప్పింది.
 
కరకంబాడిలో నిన్ను ఒక మహిళ కలుస్తుందని చెప్పింది. కరకంబాడిలో ఒక మహిళ తన పిల్లలను తీసుకొచ్చింది. ఆమెతో పాటు కారులో కూర్చుని ఇంటికి తీసుకెళ్ళింది. అయితే ఇంటికి వెళ్ళిన తరువాతే ఆ యువతికి అసలు విషయం అర్థమైంది.
 
ఆమె చేత మద్యం తాగించారు. వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశారు. ఒక యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని వచ్చేసింది. చివరకు తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగిలివారి కోసం గాలిస్తున్నారు.