శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:54 IST)

సీఎం కారెక్కుతుంటే.. యువకుడు పురుగుల మందు తాగాడు.. ఉలిక్కిపడిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉలిక్కిపడ్డారు. ఆయన కారెక్కుతుండగా ఓ యువకుడున్న ఉన్నట్టుండి కారుకు అడ్డంగా పడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ భద్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఉలిక్కిపడ్డారు. ఆయన కారెక్కుతుండగా ఓ యువకుడున్న ఉన్నట్టుండి కారుకు అడ్డంగా పడి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో సీఎం కేసీఆర్ భద్రతలోని డొల్లతనం బహిర్గతమైంది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం కరీంనగర్‌ పర్యటనకు వచ్చారు. ఆసమయలంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ గృహానికి వెళుతున్న సమయంలో కలెక్టరేట్‌ ప్రధానద్వారం వద్ద కారు ఎక్కుతుండగా పర్వతం గోపి (22) అనే యువకుడు పురుగుల మందు తాగి రక్షించండి.. కాపాడండి.. అంటూ బిగ్గరగా అరుస్తూ కారు వెనక పడిపోయాడు. 
 
హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో సీఎంతో పాటు, అక్కడే ఉన్న ఉన్నతాధికారులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మహదేవ్‌పూర్‌ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన పర్వతం గోపి తండ్రి లక్ష్మిమల్లు వయస్సు 65 సంవత్సరాలు కాగా రేషన్‌కార్డులో అతని వయస్సు 25 సంవత్సరాలుగా నమోదైంది. దీంతో అతని తండ్రికి వృద్ధాప్య పింఛను అందడం లేదు. ఇద్దరు అక్కలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ భారమవటం, నిరుద్యోగం తదితర సమస్యలను ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు విన్న వించుకోవటానికి గోపి సోమవారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకుని ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు.