సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (19:25 IST)

విశాఖలో మాజీ కార్పొరేటర్ విజయారెడ్డిని బాత్‌రూంలో వేసి.. దారుణంగా..

విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కాయపాలెంలో నివాసముంటున్న మాజీ కార్పొరేటర్ విజయారెడ్డి హత్యకు గురయ్యారు. ఎన్జీఓఎస్ పద్మభాస్కర అపార్టమెంట్లో ఐదో ఫ్లోర్‌లో ఉంటున్న ఆమె ఇంటి బాత్‌రూంలోనే రక్తపు మడుగులో శవమై కనిపించారు. అయితే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడానికని వచ్చినవాళ్లే ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
 
విజయారెడ్డి ఒంటి మీద నగలు కూడా మాయమైనట్లు ఆమె భర్త ఆరోపిస్తున్నారు. ఆమె కారును కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. గతంలో విజయా రెడ్డి పక్క ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. అయితే విజయారెడ్డి హత్య నిన్నే జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం తలుపులు పగులకొట్టి చూడగా ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తుంది. 
 
సీసీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుల్ని పట్టుకొనే పనిలోపడ్డారు పోలీసులు. వాచ్‌మ్యాన్ చెప్పిన వివరాలు ప్రకారం నిన్న ఇద్దరు విజయారెడ్డి ఇంటికి వచ్చినట్లుగా సమాచారం. ఆ ఇద్దరు ఎవరు? ఎక్కడివారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.