1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Censor Board revision committee schock to Manchu Vishnu's Kannappa After Watchig movie

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

kannappa
మంచు విష్ణు, డాక్టర్ మోహన్ బాబు నటించి, సొంతంగా నిర్మించిన చిత్రం 'కన్నప్ప'. ఈ నెలాఖరులో విడుదలకావాల్సివుంది. అయితే, ఈ మూవీకి సెన్సార్ ఇంకా క్లియర్ కాలేదు. దీనికి కారణం ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని సెన్సార్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 'కన్నప్ప' సినిమాలో 13 సన్నివేశాలు తొలగించాలని రివిజన్ కమిటీ సూచన చేసింది. తొలగించిన సన్నివేశాల సినిమా కాపీ ఇచ్చిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని రీజనల్ ఆఫీసర్ స్పష్టం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో సనాతన ధర్మాన్ని సాంప్రదాయాలను కించపరచడం, దేవి దేవతలను, పిలక గిలక పాత్రలతో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని, కోయ కులాన్ని కించపరిచే 13 సన్నివేశాలు తొలగించాల్సిందే అని 11 మంది రివిజన్ కమిటీ రిపోర్ట్ స్పష్టం చేసింది. 
 
'కన్నప్ప' సినిమాపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ నెం.6236/2025 కేస్ పెండింగ్, ప్రతివాదులుగా రీజనల్ ఆఫీసర్, సెన్సార్ బోర్డ్, సినీమా నిర్మాత మంచు మోహన్ బాబు నటులు మంచు విష్ణు బ్రహ్మానందం, సప్తగిరిలు ఈ కేసులో తమ వాదనలు వినిపించాల్సి ఉంది.
 
'కన్నప్ప' సినిమా రిలీజ్‌కి ముందు నుంచే సినిమాలో సనాతన ధర్మాన్ని కించపరచడం బ్రాహ్మణ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరచడం దేవీ దేవతలను కించపరచడం సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక మొదటి నుంచి చెప్తూనే ఉంది. 
 
'కన్నప్ప' సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని మంచు కుటుంబం గుంటూరులో జూన్ 7వ తేదీన పెట్టడం అదేరోజు సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, బ్రాహ్మణ చైతన్య వేదిక, ఏపీ అర్చక సేవా సంఘం, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కాగా, ఈ చిత్రాన్ని రివిజన్ కమిటీ సభ్యులు ఆదివారం వీక్షించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?