శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (21:31 IST)

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నాం: వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి

ఇప్పటివరకు 16,555 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 7 లాబ్స్ ఉన్నాయని, ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో మరొకటి ఏర్పాటు చేశామన్నారు.

రోజుకు 3 వేల పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో రోజుకు 17 వేల టెస్టులు చేసే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఐదుగురికి ఒకేసారి టెస్ట్ చేసే విధానాన్ని విజయవాడలో స్టార్ట్ చేశామని చెప్పారు.

ఎక్కువ టెస్ట్‌లు చేస్తేనే వైరస్‌ని అంచనా వేయ‌గ‌ల‌మ‌ని, 94 మండలాల్లో కరోనా కేసులున్నాయని పేర్కొన్నారు. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్స్ వ్యవస్థ మూడు, నాలుగు నెలలు కొనసాగుతుందని తెలిపారు.

లాక్‌డౌన్ ఎత్తివేసినా జోన్ల వారిగా చర్యలు కొనసాగుతాయన్నారు. కొత్తగా కోవిడ్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేశామని జవహర్‌రెడ్డి పేర్కొన్నారు.