బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (12:24 IST)

చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన మహిళను జీవచ్ఛవంగా మార్చిన వైద్యులు

వైద్యుల నిర్లక్ష్యంతో సంతానం కోసమని వెళ్లిన తన భార్య జీవచ్ఛవంగా మారిందని ఓ భర్త చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చైతన్యపురి ఠాణాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రామాంతపూర్‌ నె

వైద్యుల నిర్లక్ష్యంతో సంతానం కోసమని వెళ్లిన తన భార్య జీవచ్ఛవంగా మారిందని ఓ భర్త చేసిన ఫిర్యాదు స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన చైతన్యపురి ఠాణాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే.. రామాంతపూర్‌ నెహ్రూనగర్‌కు చెందిన సుమన్‌కల్యాణ్‌ వైద్యుడు. ఆయనకు జ్యోతి(36)తో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. 
 
సంతానం కలగకపోవడంతో నాగోలులోని సృజన సంతాన సాఫల్యకేంద్రాన్ని సంప్రదించారు. శస్త్రచికిత్స చేయాలని అక్కడి వైద్యులు చెప్పడంతో ఈ నెల 19న వెళ్లారు. శస్త్రచికిత్సకు ముందు మోతాదుకు మించి అనస్తీషియా (మత్తు) ఇవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆ పరిస్థితుల్లోనూ తన భార్యకు శస్త్రచికిత్స చేయడంతో 70 శాతం బ్రెయిన్‌డెడ్‌ అయింది. 
 
ఇదిపూర్తిగా ఆసుపత్రిలోని వైద్యులు సౌజన్య, శ్రీశైలేష్‌ విఠల, రాణి, స్వప్న, శ్రీకాంత్‌ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని సుమన్‌కల్యాణ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆసుపత్రి, వైద్యులపైన మెడికల్‌ కౌన్సిల్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సుమన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు.