మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 11 జనవరి 2021 (20:54 IST)

అందమైన భార్య మరొకరితో సహజీవనం చేస్తుంటే చూసిన భర్త, ఆ తరువాత?

అన్యోన్యమైన సంసారం. ఇద్దరు కొడుకులు. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు చివరకు వారిని దూరం చేసింది. విడాకుల వరకు వెళ్ళింది. విడాకులు రాలేదు కానీ.. వారిద్దరు మాత్రం విడిపోయారు. కానీ భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక లోలోపల మథనపడిపోయాడు భర్త. కానీ భార్య మాత్రం మరో యువకుడితో సంబంధం పెట్టుకుంది. అదే చివరకు ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది..
 
అనంతపురం జిల్లా రాణినగర్‌కు చెందిన శంకర్, యశోదలకు 12 యేళ్ళ క్రితం వివాహమైంది. యశోద చాలా అందంగా ఉంటుంది. వీరికి తరుణ్ తేజ్, యశ్వంత్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న సంసారం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. 
 
అయితే వీరిద్దరి మధ్య రెండేళ్ళ క్రితం చిన్నపాటి గొడవలు జరిగాయి. అది కూడా బంధువుల కారణంగా గొడవలు తలెత్తాయి. భార్య బంధువులు తన ఇంటికి రావద్దని భర్త చెప్పడంతో యశోద అలిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కాస్త  చివరకు కోర్టుకు వెళ్లింది.
 
విడాకులకు ధరఖాస్తు చేసేసుకున్నారు. అయితే కోర్టులో ఈ కేసు జరుగుతుండగానే యశోద భర్త ఇంటి నుంచి వచ్చేసింది. అశోక్ నగర్‌లో ఉన్న తన అక్క దగ్గరకు వచ్చిన యశోద పిల్లలతో పాటు ఆమె దగ్గరే ఉండేది. 
 
అయితే స్థానికంగా ఉన్న ఆటోడ్రైవర్ మల్లిఖార్జునతో యశోదకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఒకటిన్నర సంవత్సరానికి పైగా ఇద్దరూ కలిసే ఉన్నారు. భార్య లేని వెలితి కనిపించడంతో భర్త ఆమె ఇంటికి వచ్చాడు.
 
అయితే ఆమె ఇంట్లో లేకపోవడంతో పాటు స్థానికులు ఆమె ఇంకెవరితోనో ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. మల్లిఖార్జునతో యశోద కలిసి ఉండడాన్ని భర్త చూసేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్యను ప్రశ్నించాడు. నీకు విడాకులు ఇచ్చేస్తున్నానుగా... నీతో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పేసింది యశోద. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్ ఎలాగైనా భార్యను చంపేయాలనుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రిస్తున్న యశోదను అర్థరాత్రి వేళ దిండుతో ముఖంపై మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. 
 
ఆ తరువాత యశోదను తానే చంపేసినట్లు కుటుంబసభ్యుల ముందు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యశోద మరణం, తండ్రి జైలుకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారిపోయారు.