అనుమానిస్తూ వేధిస్తూ వచ్చిన భర్తను కర్కశంగా హత్య చేసిన భార్య.. ఎక్కడ?
నిత్యం అనుమానిస్తూ, ఛీత్కరిస్తూ వేధిస్తూ వచ్చిన భర్తను ఆ భార్య పక్కా ప్లాన్ హతమార్చింది. భర్త హత్య కోసం కుమారుడిని కూడా భాగస్వామిని చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..
నిత్యం అనుమానిస్తూ, ఛీత్కరిస్తూ వేధిస్తూ వచ్చిన భర్తను ఆ భార్య పక్కా ప్లాన్ హతమార్చింది. భర్త హత్య కోసం కుమారుడిని కూడా భాగస్వామిని చేసింది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపెల్లికి చెందిన చింతకుంట్ల శ్రీనివాస్ (42), అమృతలు భార్యా భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్లక్రితం బతుకు తెరువు కోసం వచ్చి పీర్జాదిగూడ బుద్దానగర్‌లో నివశిస్తూ వచ్చారు. శ్రీనివాస్ ట్రాక్టర్ (వాటర్ ట్యాంక్) డ్రైవర్‌గానూ, అమృత పీర్జాదిగూడ వరంగల్ జాతీయరహదారిపై ఉన్న కర్నాటక బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తుంది.
అయితే, భార్య ప్రవర్తనను సందేహించిన శ్రీనివాస్ పలుసార్లు మందలించాడు. దీంతో కక్ష పెంచుకున్న అమృత ఇంటర్ చదువుతున్న కుమారుడికి తండ్రిపై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి శ్రీనివాస్‌ను చంపేందుకు నిర్ణయించుకున్నారు. పని నిమిత్తం బయటకు వెళ్లి రెండు మూడు రోజులకోసారి ఇంటికి వచ్చే శ్రీనివాస్ ఎప్పటిలానే గతయేడాది డిసెంబర్ 31న సాయంత్రం వచ్చాడు. వెంటనే భార్యను చీవాట్లు పెట్టాడు.
నడవడికను మార్చుకోవాలని హెచ్చరించాడు. రాత్రి మద్యం తాగి నిద్రపోయాడు. ఇదే అదునుగా భావించిన అమృత కుమారుడు వెంకటేష్(19)తో కలిసి శ్రీనివాస్ గొంతునులిమింది. ప్లాస్టిక్ వైరుతో వూపిరాడకుండా చేశారు. అదే వైరుతో ఫ్యాన్‌కు వేలాడదీసి ఏమీ తెలియనట్లుగా వెళ్లి నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ లబోదిబోమన్నారు. పోలీసులు వచ్చేలోపు మృతదేహాన్ని కిందకు దించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నెలన్నరపాటు అమృత కదలికలపై కన్నేసిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరోసారి రంగంలోకి దిగి పరిశోధన మొదలుపెట్టారు. అమృతను ప్రశ్నించడంతో చివరికి వాస్తవాలు బయటపడ్డాయి. భర్త వేధింపులు, అనుమానాలతో అతన్ని మట్టుపెట్టినట్లు అమృత పోలీసుల ముందు అంగీకరించింది. శనివారం ఆమెను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వెంకటేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.