సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (19:59 IST)

శ్రీకాళహస్తి సీఐ లేడీ ఆఫీసర్ ఓవరాక్షన్.. సీరియస్ అయిన మహిళా కమిషన్

CI
CI
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ ఓవరాక్షన్ మాములుగా లేదు. మాముళ్ల కోసం కొందరు సామాన్యులపై ఆమె అరాచకాలకు అడ్డూ లేకుండా పోయిందని వాపోతున్నారు బాధితులు. తాజాగా శ్రీకాళహస్తిలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళపై సీఐ అంజు యాదవ్ వ్యవహరించిన తీరుపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. 
 
సీఐ అంజుపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి. గతంలోనూ సీఐ అంజు యాదవ్ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా సిఐ తీరు ఉందన్నారు. సాటి మహిళ పట్ల సభ్యసమాజం తలదించుకునేలా మహిళా పోలీసు అధికారిణి వ్యవహరించారని పేర్కొన్నారు. 
 
కాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ లేడీ ఆఫీసర్ ఒక హోటల్ నిర్వాహకురాలిపై దారుణంగా దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆమె గతంలోనూ మామూలు కోసం ఇలాగే దుందుడుకుగా వ్యవహరించేవారని ఆరోపిస్తున్నారు స్థానికులు.