గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 అక్టోబరు 2022 (19:27 IST)

ఉపరితల ఆవర్తనం ప్రభావం.. రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Rains
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురువనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం కారణంగా రాగల 24 గంటల్లో ఈశాన్య, దాని పరిసరాల్లోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. రాగల మూడురోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
 
తెలంగాణలో అక్కడక్కడ ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఇటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ముసురు పట్టుకుంది. నగరంలోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదాలకు ఇక్కట్లు తప్పడం లేదు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు పడుతున్నాయి.