మంగళవారం, 31 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 28 సెప్టెంబరు 2022 (15:57 IST)

బిగ్ బాస్ ఆరో సీజన్‌.. సూర్యకి మసాజ్.. ఆరోహి సిగ్గులు ఒలకబోస్తూనే..?

Bigg boss
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో భాగంగా బీబీ హౌటల్‌లో ఉన్న చంటికీ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ ప్రక్రియ పూర్తికాగానే కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెడతాడు బిగ్‌బాస్‌. దీని కోసం హౌస్‌మేట్స్‌కు రకరకాల టాస్కులు ఇస్తాడు. 
 
అదేంటంటే..బీబీ హోటల్‌కి వచ్చే అతిథులను ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి పారిపోయేలా చేసి, వారందరిని గ్లామ్‌ ప్యారడైజ్‌కు తరలించారు. వీలైనంత ఎక్కువమందిని గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌కి తరలించాలి, వారు విజయం సాధించేలా చేస్తే.. చంటి నేరుగా కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవుతాడు. అయితే ఈ టాస్క్‌ అంత రసవత్తరంగా సాగలేదు.
 
ప్రతి సీజన్‌లో ఇచ్చిన టాస్కే.. మళ్లీ ఇవ్వడంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్సయింది. అంతేకాదు కంటెస్టెంట్స్‌ కూడా తమకు ఇచ్చిన పాత్రల పరిధి దాటి ప్రవర్తించారు. హోటల్‌ మేనేజర్‌గా ఉండాల్సిన ఫైమా.. హౌస్‌ కీపింగ్‌ మెంబర్‌లా ప్రవర్తించింది. ఇక శ్రీసత్య మాత్రం తెలివిగా అర్జున్‌ వీక్‌నెస్‌తో ఆడుకుంటుంది. 
 
అర్జున్‌ కూడా దొరికిందే చాన్స్‌ అని.. ఆమెతో అన్ని పనులు చేయించుకుంటున్నాడు. డబ్బులిచ్చి భుజమ్మీద చేయి వేసి ఫొటో తీయించుకోవడం, అన్నం తినిపించడం లాంటి పనులను శ్రీ సత్యతో చేయించుకుంటూ అర్జున్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు . 
 
ఇక సూర్యకి మసాజ్ చేయమని చెప్పడంతో ఆరోహి సిగ్గులు ఒలకబోస్తూనే బాడీ మసాజ్‌ చేసింది. మొత్తానికి మంగళవారం ఎపిసోడ్‌ అయితే అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ రోజు ఏదో గొడపడినట్లు ప్రోమోలో చూపించారు. కనీసం ఆ గొడవతోనైనా బిగ్‌బాస్‌కి హైప్‌ వస్తుందో చూడాలి.