శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 సెప్టెంబరు 2022 (18:02 IST)

‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌’లో తనదైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన నటుడు నాగచైతన్య, ఏంటది?

Nagachaitanya
తెలుగు చిత్ర నటుడు నాగ చైతన్య అక్కినేని, సుప్రసిద్ధ లగ్జరీ, లైఫ్‌స్టైల్‌ మ్యాగజైన్‌ మెన్స్‌ వరల్డ్‌ ఇండియా సెప్టెంబర్‌ 2022 సంచిక ముఖచిత్రంగా కనిపించి, వివేకవంతమైన స్టైల్‌ స్టేట్‌మెంట్‌ను ‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌’ కలెక్షన్‌ ధరించి అందించారు. తెలుగు, తమిళ చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల ద్వారా గుర్తింపు పొందారు నాగచైతన్య. ఆయన నటించిన చిత్రాలలో మనం, ఏం మాయ చేశావె, 100% లవ్‌ మొదలైనవి అత్యధిక ప్రజాదరణ పొందడంతో పాటుగా ఇటీవలనే బాలీవుడ్‌ చిత్రం లాల్‌ సింగ్‌ చద్దాలో సైతం నటించి ప్రశంసలనందుకున్నారు. దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యం పొందిన  నటులలో నాగచైతన్య అక్కినేని ఒకరు.
 
పురుషుల ఫ్యాషన్‌, శైలిపై అధికారం కలిగినట్లు ఈ సంచికలో నాగచైతన్య అక్కినేని పలు చిత్రాల ద్వారా తనదైన శైలిని వెల్లడించే ప్రయత్నం చేశారు. ఆయన ఈ సీజన్‌లో పురుషుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాటినమ్‌ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ ఆభరణాలు సుప్రసిద్ధ ఆభరణాల రిటైల్‌ ఔట్‌లట్ల వద్ద లభ్యమవుతున్నాయి. ఆడంబరం, క్లాస్‌కు ప్రతిరూపంగా నిలిచిన ఈ నటుడు ‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌’ కలెక్షన్‌లో  విభిన్నమైన ఆభరణాలను ధరించారు. వీటిలో  బోల్డ్‌ రింగ్స్‌, డ్యూయల్‌ టోన్‌ రిస్ట్‌వేర్‌, స్వచ్ఛమైన, అతి అరుదైన ప్లాటినమ్‌లో తీర్చిదిద్దిన  వైవిధ్యమైన నెక్‌వేర్‌ ఉంది. ఈ కలెక్షన్‌ యొక్క వైవిధ్యతను మరింత స్పష్టంగా కనిపించే రీతిలో ఈ నటుడు సున్నితమైన ఫార్మల్‌ వేర్‌లో, టైలర్డ్‌ సెమీ ఫార్మల్స్‌, అలాగే ట్రెండీ క్యాజువల్‌ ఔట్‌ఫిట్స్‌ను ధరించారు.
 
ప్లాటినమ్‌తో తయారైన ఆభరణాలు, వాటిని ధరించిన వ్యక్తుల శైలిని తక్షణమే మెరుగుపరుస్తాయి. అంతేకాదు, గుంపులోనూ ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ భూమిపై ఉన్న అతి అరుదైన లోహాలలో ఒకటైన ప్లాటినమ్‌, ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది ప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతుంది. అరుదైన, విలువైన వస్తువుకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. అందువల్ల ప్లాటినమ్‌ ఆభరణాలను నూతన యుగపు విజయానికి చిహ్నంగా చూస్తున్నారు. అత్యంత అరుదైన విలువలు, లక్షణాలు కలిగిన మగవారికి ఇది ఖచ్చితమైన సరిజోడుగా నిలుస్తుంది.
 
‘మెన్‌ ఆఫ్‌ ప్లాటినమ్‌ ’యొక్క తాజా కలెక్షన్‌లో విస్తృత శ్రేణిలో మార్గదర్శక డిజైన్లు ఉన్నాయి. వీటిలో ప్లాటినమ్‌ చైన్స్‌, రిస్ట్‌ వేర్‌ కూడా ఉన్నాయి. ఈ ఆభరణాలు మినిమలిజం అత్యంత కీలకంగా స్వచ్ఛమైన, బోల్డ్‌ లైన్స్‌ను కలిగి ఉంటాయి. దీనియొక్క డిజైన్‌ భాషలో  వైవిధ్యమైన  చిహ్నాలు, ధృడమైన రూపంలో  క్రెస్ట్స్‌, ఏరోడైనమిక్‌ అంశాలు ఉంటాయి. విభిన్నమైన పనితనాన్ని ఇవి ప్రదర్శిస్తాయి.  స్టేట్‌మెంట్‌ సిల్‌హ్యుటీలు, విలాసవంతమైన టెక్చర్స్‌ ఏకతాటిపైకి రావడంతో పాటుగా ఈ అతి  సున్నితమైన శ్రేణి ఆభరణాలను  వైవిధ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తులకు అందిస్తాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా, వినూత్నంగా ఉండాలనుకునే వారి అభిరుచులను ఇవి తీరుస్తాయి. 95% స్వచ్ఛతకు భరోసా అందిస్తూ ప్లాటినమ్‌ ఇప్పుడు ఆభరణాలలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన స్వచ్ఛతను అందిస్తుంది.