గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (14:11 IST)

కడపలో గంజాయి అమ్ముతున్న మహిళలు, షాక్ తిన్న పోలీసులు

కడప జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
 
విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి కడపలో విక్రయిస్తోంది గంజాయి ముఠా. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక టాటా బోల్ట్ కారు, 7 వేల రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిన్నచౌక్ పోలీసులు.