గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 23 జులై 2021 (10:53 IST)

పోల‌వ‌రంపైనా... ఆర్.ఆర్.ఆర్.పైనా పార్ల‌మెంటులో ప్ర‌ద‌ర్శ‌న‌

ఏపీలో ముఖ్య స‌మ‌స్య‌ల‌పైనే కాదు... అంత‌క‌న్నా ముఖ్య స‌మ‌స్య ఎంపీ ఆర్.ఆర్.ఆర్. అన‌ర్హ‌త వేటుపైనా వైసీపీ పార్ల‌మెంటులో పోరాటం ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాల‌ని తిరుపతి ఎం పి ఎం. గురుమూర్తి డిమాండు చేశారు.

తిరుపతి ఎంపీగా ప్రమాణం చేసిన వెంట‌నే సహచర ఎం పి ల తో కలసి తిరుపతి ఎం పి గురుమూర్తి  వైస్సార్సీపీ అధ్యక్షులు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యల పై పోరాటం మొదలు పెట్టారు.
 
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ హక్కు అని, సవరించిన ప్రాజెక్ట్ అంచనాలను తక్షణం కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఎంపి ఎం. గురుమూర్తి లోక్ సభలో సహచర వైస్సార్సీపీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. వెల్ లోకి దూసుకెళ్లి ప్లకార్డుల చూపుతూ ఆందోళన చేసారు.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు మేరకు తక్షణం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సవరించిన అంచనాలు ఆమోదించాలని లోక్ సభ వెల్లో వైసీపీ ఎంపిలతో నిరసన గళం వినిపించారు. అలాగే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్య తీసుకుని ప్రజాస్వామ్యంను కాపాడాలని డిమాండ్ చేశారు.

వెల్ లో నిలబడి స్పీకర్ ఓం బిర్లాకు ప్లకార్డు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. కొర‌క‌రాని కొయ్య‌గా మారిన వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాల‌ని డిమాండు చేశారు.