సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (10:29 IST)

4 భాషలు తెలిసిన సీఎం జగన్ ప్రధానిగా ఎదుగుతారు : నూజివీడు ఎమ్మెల్యే

భారత దేశంలోనే నాలుగు భాషలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ఆయన దేశ ప్రధానిగా ఎదుగుతారని నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు జోస్యం చెప్పారు. 
 
విజయవాడలో గురువారం జరిగిన గృహ నిర్మాణాల సమీక్షలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలవర్షం కురిపించారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో నాలుగు భాషలు తెలిసి, నాలుగు భాషల్లో మాట్లాడగలిగే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాన్ని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచాలని కోరారు. 
 
ఆ తర్వాత పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ మరో 30 ఏళ్లపాటు జగనే ఈ రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. జియో ట్యాగింగ్‌లో కాలయాపన జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విజయవాడకు చెందిన లబ్ధిదారుల కోసం మైలవరం నియోజకవర్గంలో భూములు కొనుగోలు చేసిన విషయాన్ని అధికారులు తనకు చెప్పనేలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.