బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (09:48 IST)

నేడు సీఎం జగన్ పోలవరం టూర్ - పనుల పురోగతిపై రివ్యూ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రాజెక్టు వద్ద జరుగుతున్న కాఫర్‌ డ్యామ్‌ పనులు, రేడియల్‌ గేట్లు, అప్రోచ్‌ చానల్‌ను పరిశీలిస్తారు. 
 
అనంతరం, మధ్యాహ్నం 12 గంటల నుంచి జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, సీఈ సుధాకరబాబు తదితరులతో ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. నిజానికి గత వారమే ఆయన పోలవరం పర్యటనకు వెళ్ళాల్సివుంది. కానీ చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దు అయిన విషయం తెల్సిందే.