గెజిట్ మనమే కోరాం... కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం : సీఎం జగన్
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిలోకి తెస్తూ కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాగతించారు. ఈ గెజిట్ తీసుకుని రావాలని మనమే కోరామని, అందువల్ల ఈ చర్యను స్వాగతిద్దామని పార్టీ నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఈ గెజిట్‌పై ఆయన స్పందిస్తూ, ఈ ప్రకటనను ఓవరాల్‌గా స్వాగతించి లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు సీఎం జగన్ సూచించారు.
కేంద్రం గెజిట్ విడుదల చేసిన తర్వాత తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో కార్యదర్శి జె.శ్యామల రావు, సి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.