1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 17 జులై 2021 (12:19 IST)

పోలవరానికి జగన్‌ పర్యటన : టూర్ వివరాలు ఇవే...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పోలవరం. ఈ ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంకల్పించింది. ఆ దిశగా శరవేగంగా పనులు చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని ఏపీ సీఎం జగన్ భావించారు. 
 
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ పర్యటన వాయిదా పడింది. తాజాగా ఆయన పోలవరం పర్యటన ఖరారైంది. ఈ నెల 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
 
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే, 19వ తేదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అక్కడ కాఫర్ డ్యామ్, ప్రాజెక్టు వివిధ భాగాలను సందర్శిస్తారు. ఆపై మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టరులో తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.