ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (14:36 IST)

రాయలేని భాషలో చంద్రబాబును దూషించిన విజయసాయి రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా లేకుండా, ఆయన్ను దారుణంగా కించపరిచేలా మాటల తూటా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైకాపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా లేకుండా, ఆయన్ను దారుణంగా కించపరిచేలా మాటల తూటాలు పేల్చారు. 
 
మంగళవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీకి విజయసాయి రెడ్డి పాదాభివందనం చేసి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనను ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలతో పోల్చడాన్ని విజయసాయి తప్పుబట్టారు. ఏ ఒక్క బ్యాంకు నుంచి అయినా ఒక్క రూపాయి రుణం తీసుకున్నానా అంటూ ప్రశ్నించారు. 
 
టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ పార్టీ, ఆ పార్టీలోనే నేరగాళ్లకు చంద్రబాబు లీడర్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, చంద్రబాబు గజదొంగ చార్లెస్ శోభరాజ్‌ను మించిన గజదొంగ అంటూ మండిపడ్డారు. రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలో కొనసాగుతున్నారని, మీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్‌లను నిర్వహిస్తున్నారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

బెంగుళూరు రోడ్లలో పేకాట క్లబ్‌లు నడిపేవారు ఇపుడు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారన్నారు. అలాగే, రెండేళ్ళు శిక్ష పడిన ఎమ్మెల్యే చింతమనేని  ప్రభాకర్ ఇపుడు టీడీపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. 

అలాగే, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, మరో ఎంపీ వైఎస్ చౌదరిలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీఎం రమేష్ నాటుసారా అమ్ముకుని బతికిన వ్యక్తి' అని విమర్శించారు. అలాగే సీఎం రమేష్‌ బండారం రెండు, మూడు రోజుల్లో బయటపెడతానని అన్నారు.

అంతేగాక మాజీ కేంద్రమంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తి సుజనాచౌదరి అని విజయసాయిరెడ్డి అంటూ మండిపడ్డారు.