Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాకింగ్ చేస్తుండగా గుండెపోటు- 28 ఏళ్ల యువకుడి మృతి

Written By సెల్వి
Updated: శుక్రవారం, 21 జులై 2023 (12:53 IST)
Walking
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజాం, మొగిలివలసకు చెందిన శ్రీహరి (28) శుక్రవారం వాకింగ్ వెళ్లాడు. 
 
వాకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీహరి కుప్పకూలిపోయాడు. గుర్తించిన  అగ్నిమాపక సిబ్బంది రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ శ్రీహరి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు రెడీ అవుతున్న శ్రీహరి మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకో మగడా అంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments