వైజాగ్ ఆర్కే బీచ్‌లో విషాదం... నలుగురు గల్లంతు... మృతి
కొత్త సంవత్సరం రోజున విశాఖపట్టణం రామకృష్ణ బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్కే బీచ్‌లో సముద్రస్నానాకి వెళ్లిన ముగ్గురు యువకులు, ఓ యువతి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను సహాకయ బృందాలు గుర్తించాయి. మరో రెండు మృతదేహాల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఒకరు ఒడిషా రాష్ట్రానికి చెందిు సునీత త్రిపాఠి, హైదరాబాద్ నగరానికి చెందిన శివగా గుర్తించారు. సునీత పిక్నిక్ కోసం ఒడిషా నుంచి వైజాక్‌కు వచ్చి మృత్యువాతపడింది. అలాగే, గల్లంతైన కె.శివ, అజీజ్ కోసం గాలింపు కొనసాగుతోంది.