మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (10:26 IST)

ఆర్కే బీచ్‌లో పిచ్చిదానిలా తిరుగుతున్న సుప్రీంకోర్టు న్యాయవాది

ఒకపుడు ఆమె సుప్రీంకోర్టు న్యాయవాది. ఎన్నో కేసులను వాదించారు. జయించారు కూడా. కానీ ఇపుడు విశాఖపట్టణం జిల్లాలోని ఆర్కే బీచ్‌లో పిచ్చిపట్టినదానిలా తిరుగుతున్నారు. ఆమె పేరు రమాదేవి. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాడుతున్న ఈమెను కొందరు గుర్తించి, టీఎస్సార్ కాంప్లెక్స్‌లోని ఆశ్రయ కేంద్రానికి తరలించారు. సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తానని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పని చేసిన రమాదేవి ఇపుడు విశాఖ ఆర్కే బీచ్‌లో తిరుతున్నట్టు విషయం తెలుసుకున్న కొందరు న్యాయవాదులు షాకయ్యారు. ఆ వెంటనే విశాఖ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింగ రావు, ఇతర న్యాయవాదులు శనివారం ఆమెను ఆశ్రయ కేంద్రానికి వెళ్లారు. 
 
అయితే, ఆమె అక్కడ ఉండేందుకు నిరాకరించి వెళ్ళి పోయేందుకు ప్రయత్నించారు. అయితే, అతికష్టంమ్మీద ఆమె బయటకు వెళ్లనీయకుండా నిలువరించారు. దీనిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ, రమాదేవి పరిస్థితిని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.