గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (12:41 IST)

మా డాడీ క్షేమంగానే ఉన్నారు.. పుకార్లు నమ్మొద్దు : కైకాల కుమార్తె

తన తండ్రి, ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంగానే బాగానే ఉన్నారనీ, ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ ఆయన కుమార్తె విజ్ఞప్తి చేశారు. 
 
కాగా, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన కైకాల సత్యనారాయణను హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులో ఓ వార్త షేర్ అవుతుంది. 
 
దీనిపై ఆయన కుమార్తె రమాదేవి స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల వందతులను నమ్మొద్దంటూ కోరారు. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగానేవుందన్నారు. ఆయన కోలుకుంటున్నారన్నారు. బాగా స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. 
 
డాక్టర్ మాదాల రవి వచ్చి చూశారు. ఆయనతో కూడా మాట్లాడి థమ్సప్ కూడా చూపించారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. దయచేసి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దు అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు.