శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (10:42 IST)

జననేత వైఎస్ఆర్ వర్థంతి... రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఘననివాళులు అర్పించారు. వైఎస్సార్‌ తొమ్మిదో వర్థంతి సందర్భంగా జననేత విగ్రహానికి

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఘననివాళులు అర్పించారు. వైఎస్సార్‌ తొమ్మిదో వర్థంతి సందర్భంగా జననేత విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరం శివారులోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం వైఎస్‌.జగన్‌ ఈ మేరకు మహానేతను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ వెంట ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు 'జోహార్‌ వైఎస్సార్' అంటూ నినాదాలు ఇచ్చారు.
 
వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం జననేత 252వ రోజు ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. అన్నవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం, జి.జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజకవర్గం వేచలం క్రాస్‌, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. 
 
అలాగే, రాజశేఖర్ రెడ్డి తొమ్మిదో వర్థంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, శ్రేణులు వివిధ రకాల కార్యక్రమాలను చేపడుతున్నారు. ముఖ్యంగా, అన్నదాలు, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే, ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు, పాలు అందజేశారు. వివిధ అనాథాశ్రయాల్లో ఉండే పిల్లలకు రుచికరమైన భోజనాలను ఏర్పాటుచేశారు.