సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (11:57 IST)

సీతమ్మలాంటి భారతమ్మ.. రాముడులాంటి జగనన్న : శివపార్వతుల్లాగా ఉండాలి.. రోజా ట్వీట్

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా ట్వీట్ చేశారు. జగనన్న దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని ఆ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా ట్వీట్ చేశారు. జగనన్న దంపతులకు  మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. పైగా, జగన్ - భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
 
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ మంగళవారం పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ పార్టీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. జగన్, భారతిల పెళ్లి నాటి ఫొటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన రోజా, సీతమ్మ వంటి భారతమ్మ జగన్‌కు దొరికిందని అభిప్రాయపడ్డారు. 
 
'సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగనన్నకి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతమ్మకి... ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో శివపార్వతుల్లాగా కలిసి ఉండాలి అని మనసారా కోరుకుంటన్నాము...!!!' అని పేర్కొన్నారు.