బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (11:58 IST)

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహం ధ్వసం.. కత్తితో నరికి?

చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో నరికి ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు షాకయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ చిత్తూరు-పుత్తూరు రోడ్డుపై నాయకులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.   
 
ఇటీవల ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పరపాలెంలోని వైఎస్సార్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. 
 
విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో.. మెడలోని దండలు పూర్తిగా కాలిపోయి.. విగ్రహం బీటలు వారింది. అర్ధరాత్రి మంటలు రావడంతో.. గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.