శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (12:21 IST)

కోవిడ్‌కూ రంగేశారు... అద్దె వాహనాలకూ వైకాపా రంగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలకు రంగుల పిచ్చి బాగా ముదిరిపోయింది. గతంలో న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులేదు. తాజాగ్ కోవిడ్ రోగులను తరలించేందుకు ప్రభుత్వం అద్దెకు తీసుకున్న వాహనాలకూ వైకాపా రంగులు వేశారు. ఈ తంతు గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొవిడ్‌ రోగుల కోసం అత్యవసర రవాణా వాహనాలను గుంటూరులో లీజుకు తీసుకున్నారు. వీటిని సోమవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. మొత్తం 77 వాహనాలను తీసుకుని నియోజకవర్గ కేంద్రాలకు పంపించారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లోని కొవిడ్‌ బాధితులను డివిజన్‌, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు వేగంగా తరలించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి జిల్లా అధికారులు ఈ వాహనాలు సమకూర్చుకున్నారు. అయితే ఈ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.