Daily Horoscope
✕

తమిళనాట "జయ"హోరే

Updated: శుక్రవారం, 8 మే 2009 (11:03 IST)
తమిళనాట పార్లమెంటు ఎన్నికలలో జయలలిత ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. అధికార పార్టీపై ప్రజలలో ఉన్న అసంతృప్తి బహిరంగంగానే వెల్లడవుతుండటంతో అది అన్నాడీఎంకేకు లాభించనుంది.

మరోవైపు ఆకాశన్నంటిన నిత్యావసర వస్తు ధరలు, శ్రీలంకలో తమిళుల సమస్య, రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్తు కోతలతో ప్రజలు పూర్తిగా పాలకపార్టీపై విసుగెత్తిపోయారని పలు సర్వేలు చెపుతున్నాయి.

పురుచ్చితలైవిగా తమిళ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జయలలిత ఎక్కడికక్కడ తన ప్రసంగపు వాగ్ధాటితో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. తనకు ఏ కుటుంబ బాంధవ్యాలు లేవనీ, పాలకపార్టీ నాయకుని కుటుంబంలోని సభ్యులకు పదవులతోపాటు వ్యాపారాలు కట్టబెట్టాలని, ఈ క్రమంలో పాలకపార్టీ పూర్తిగా బంధువుల బాగోగుల తప్పించి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.

హామీల విషయానికొస్తే.... శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక ప్రాంతం, కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఆరు లక్షల పోస్టులు భర్తీ, తపాలా శాఖలో తాత్కాలికంగా పనిచేస్తున్న 3 లక్షల మందిని పర్మినెంట్, చెరకు మద్దతు ధర వంటివెన్నో ఉన్నాయి.

మొత్తమ్మీద చూస్తే జయలలిత సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదంతా చూస్తుంటే లోక్‌సభ ఎన్నికలలో జయలలిత అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
About Author
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... Read More

అన్నీ చూడండి

Weather Forecast: తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 21, 2026న వాతావరణం ఎలా వుంటుందంటే..?

వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం

బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?

జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC

రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

Show comments