బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 మార్చి 2024 (09:35 IST)

ఆ మూడు స్థానాలు మినహా 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు!

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు గాను 18 చోట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో మూడు స్థానాల్లో మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచింది. అవనిగడ్డ, విశాఖ సౌత్, పాలకొల్లు నియోజవర్గాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
jsp candidates list


ఆరంభంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి మరో 11 మంది పేర్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 18 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. అలాగే, ఆ పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాల్లో మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించిన విషయం తెల్సిందే.
jsp candidates list


మూడు అసెంబ్లీ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. ఈ ముగ్గురిని కూడా నేడో రేపో ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.