వయనాడ్‌లో రాహుల్ గాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరు?
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి సీపీఐ తరపున డి.రాజా సతీమణి పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరును కమలం పార్టీ ప్రకటించింది. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న సురేంద్రన్ పేరును రాహుల్ ప్రత్యర్థిగా ప్రకటించారు. కోళికోడ్‌కు చెందిన సురేంద్రన్ పేరును బీజేపీ తాజాగా ప్రకటించిన ఐదో జాబితాలో వెల్లడించింది. ఇదే లిస్టులో బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ తదితర పేర్లు ఉన్నాయి. అభిజిత్ స్వచ్ఛంధ విరమణ తీసుకున్న విషయం తెల్సిందే.
అయితే, బీజేపీ ప్రత్యర్థిగా బరిలో నిలిచిన సురేంద్రన్ గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో పత్తినంపట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కమ్యూనిస్టుల తర్వాత మూడో స్థానంలో నిలించారు. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన మంజేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే, 2019లో జరిగిన ఉప ఎన్నికల్ల కూడా ఆయనకు ఓటమి ఎదురైంది. 2020లో కేరళ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేంగా ఆయన పోరాడి ప్రజలకు బాగా దగ్గరయ్యారు. ఈ పోరాటం ద్వారా ఆయన వ్యక్తిగత ఛరిష్మాతో పాటు.. బీజేపీని కూడా జనబాహుళ్యంలోకి తీసుకెళ్ళగలిగారు. దీంతో వయనాడ్ స్థానం ఇపుడు వీఐపీ సెగ్మెంట్‌గా మారిపోయింది.
కృష్ణగిరి లోక్‌సభ స్థానం బరిలో వీరప్పన్ కుమార్తె!!
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ పోటీ చేస్తున్నారు. సినీ దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి తరపున ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. నిజానికి ఈమె గతంలో పీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనత పార్టీలో చేరారు. గత నాలుగేళ్లుగా ఆమె బీజేపీలో ఉంటూ వచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున టిక్కెట్ ఆశించారు. కానీ, కాషాయం పార్టీ ఆమెకు సీటు కేటాయించలేదు. అదేసమయంలో నామ్ తమిళర్ కట్చి కృష్ణగిరి లోక్‌సభ సీటును ఆమెకు కేటాయించింది. దీంతో బీజేపీకి టాటా చెప్పేసి వెంటనే సీమాన్ పార్టీలో చేరిపోయారు.
నాలుగేళ్ళుగా ఆమె భారతీయ జనతా పార్టీలో ఉంటున్నారు. కానీ, ఆమెకు బీజేపీ నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ పార్టీలో చేరారు. కాగా, రానున్న ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోన ఒక్క లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థులను బరిలోకి దించుతుంది.
సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? పవన్ కళ్యాణ్‌పై ముద్రగడ సెటైర్లు
ఇటీవల వైకాపాలో చేరిన కాపు పెద్దగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా వాళ్లకు ఈ రాజకీయాలు ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. త్వరలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా జెండా ఎత్తేస్తాడని జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం తథ్యమని ఆయన అన్నారు. పైగా, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేస్తానని స్పష్టంచేశారు.
ఆయన ఆదివారం మాట్లాడుతూ, సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారన్నారు. సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం పక్కా అని ముద్రగడ జోస్యం చెప్పారు. తనను చంద్రబాబు ఎంతో బాధపెట్టాడని, తన శత్రువైన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ఎన్నికల్లో పవన్, చంద్రబాబుల ఓటమికి కృషి చేస్తానని చెప్పాు. నా శత్రువుతో చేతులు కలిపిన వ్యక్తి నీతులు చెబితే నేను వినాలా? అని మండిపడ్డారు. 21 సీట్లకు సర్దుబాటు చేసుకున్న పవన్‌కు నేనెందుకు మద్దతు ఇవ్వాలని అని ముద్రగడ ప్రశ్నించారు.