శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (10:44 IST)

హైదరాబాద్‌లో దారుణం... 100 కుక్కలను కాల్చి చంపారు...

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధుల్లో కుక్కల బెడద అధికంగా ఉందనీ వంద కుక్కలను కాల్చి చంపారు. ఈ దారుణం అమీర్‌పేటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అమీర్‌పేట నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. వీధుల్లో కుక్కల బెడద అధికంగా ఉందనీ వంద కుక్కలను కాల్చి చంపారు. ఈ దారుణం అమీర్‌పేటలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... అమీర్‌పేట నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వంద వీధి కుక్కలను సమీపంలోని కొంగర అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపారు. ఈ క్రమంలో అడవిలో కుక్కల అరుపులు.. బాధలు వర్ణణాతీతం. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేయడంతో జంతుహివస కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
 
పశుసంవర్థక శాఖ వైద్యులు కుక్కల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించి.. వాటి శాంపిళ్లను పరీక్ష కోసం లేబోరేటరీకి పంపించినట్లు చెప్పిన పోలీసులు.. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుక్కల బెదద ఉంటే సమాచారాన్ని అందించాలి కానీ.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకూడదని.. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.