సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 19 మే 2018 (10:29 IST)

టెక్సాస్‌లో దారుణం.. పాఠశాల్లో కాల్పులు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పాఠశాలలో భారీ మ

అమెరికాలోని టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఓ అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పాఠశాలలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
 
టెక్సాస్‌లోని శాంటా హైస్కూల్లో ఘటన జరిగింది. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీతో స్కూల్లోకి వచ్చిన నిందితుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. 
 
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్కూల్లో మొత్తం 14 వందల మంది విద్యార్థులు ఉన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.