1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:16 IST)

కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరిన గిరినాగు పట్టివేత

giri nagu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా ఎం.కోడూరులో భారీ గిరినాగును పట్టుకున్నారు. కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరిన ఈ పామును గుర్తించిన స్థానికులు ఈ పామును పట్టుుకున్నారు. ఇది 13 అడుగుల పొడవుతో ఉంది. 
 
ఎం కోడూరు గ్రామానికి చెందిన రైతు యలమంచిలి రమేశ్ తన పొలంలో కోళ్లను పెంచుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ గిరినాగు మంగళవారం కోళ్లను వెంబడిస్తూ వాటి గూట్లోకి దూరింది. 
 
దాన్న గమనించిన రైతు.. వెటంనే పాములు పట్టడంలో నిపుణుడైన వెంకటేశ్‌ అనే వ్యక్తికి సమాచారం చేరవేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న వెంకటేశ్... 20 నిమిషాల పాటు శ్రమించి పామును సజీవంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత అల్లూరి సీతారామరారుజ జిల్లా వంట్లమామిడి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచెపెట్టారు.