1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 మే 2025 (16:36 IST)

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

Janu_Dileep
Janu_Dileep
ఢీ డాన్సర్ జాను ఫాలోవర్స్ కొన్ని గంటల వ్యవధిలోనే వేలల్లో పెరిగిపోయారు. ఆమె ఏడుస్తూ పెట్టిన వీడియోలు చూసి చలించిపోయారో ఏమో కానీ.. ఫాలో బటన్స్ నొక్కేయడంతో ఆమె ఫాలోవర్స్ 1.5 మిలియన్స్‌కి చేరిపోయారు. శనివారం తాను చాలా స్ట్రాంగ్ అంటూ వీడియో షేర్ చేసింది. 
 
"అందరూ నన్ను క్షమించండి.. నిన్న నేను ఏదైతే వీడియోలు చేశానో.. వాటిని చూసి చాలామంది బాధపడ్డారు. చాలామంది రియాక్ట్ అయ్యారు.. నాకు సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ సోమచ్" అంటూ చెప్పుకొచ్చింది. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని క్లారిటీ ఇచ్చేసింది. 
 
"నా పెళ్లి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. నా పెళ్లి వల్ల ఎవరికైనా నష్టం ఉందా? అవును నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను.. నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషంతోనే నేను సమాధానం చెప్తా." అంటూ వెల్లడించింది. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి సింగర్ దిలీప్ అని కూడా ప్రకటించింది. 
 
అదేవిధంగా జానును రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సింగర్ దిలీప్ కూడా ప్రకటించారు. "మేము ఇష్టపడ్డాం, తప్పు చేయలేదు" అంటూ సింగర్ దిలీప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇరు కుటుంబాలు తమ పెళ్లికి  ఒప్పుకున్నాయని, ట్రోల్స్‌ను తట్టుకుంటామని చెప్పారు. 
 
ఈ సందర్భంగా కలిసి జీవించాలని ఆకాంక్షించిన వారికి.. తమకు మద్దతు తెలిపిన వారికి.. తమను సమర్థించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు సింగర్ దిలీప్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.