శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:24 IST)

బాబాయ్ ఎండలు... ఏపీలో వడదెబ్బకు 13 మంది చనిపోయారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయ్. కాలు బయటకు పెట్టలేని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. అమరావతి పరిధిలో భానుడి దెబ్బకు శరీరంపై బొబ్బలెక్కుతున్నాయి.వడదెబ్బతో పాటు.. ఉక్కపోత కారణంగా ఏకంగా 13 మంది చనిపోయారు. 
 
ఏప్రిల్‌ ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల నడుమ నమోదవుతున్నా.. వేడి తీవ్రత మాత్రం 46 డిగ్రీలకు మించినట్టుగా ఉంటోంది. విజయవాడ పరిధిలో ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. జనంతో కళకళలాడే విశాఖ బీచ్‌రోడ్డు, కలెక్టర్‌ కార్యాలయాలు రద్దీవేళల్లోనూ పల్చగా కనిపిస్తున్నాయి. కడపలోనూ ఉదయం నుంచే ఎండ చుర్రుమంటోంది. 
 
10 నిమిషాలు ఎండలో ఉంటే చాలు భరించలేని తలనొప్పి.. ధరించిన దుస్తులు చెమటతో తడిసిముద్దయిపోతున్నాయి. వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడినట్లు అధికారిక గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈ మరణాల్లో ఆరు ఒక్క అనంతపురం జిల్లాలోనే చోటుచేసుకున్నాయి.