బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (11:57 IST)

హైదరాబాద్ థియేటర్లో బాలికపై అత్యాచారం.. నీళ్లిప్పిస్తానని సెల్లార్‌కు తీసుకెళ్లి?

హైదరాబాద్ థియేటర్లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సినిమా హాలుకు ఎదురుగా

హైదరాబాద్ థియేటర్లో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణను ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. సినిమా హాలుకు ఎదురుగా నివసించే బాలిక నీటి కోసం వెళ్ళింది. రోజూ ఆ సినిమా హాలుకు వెళ్లి అక్కడున్న పంపులో నీళ్లు తెచ్చుకునే ఆ బాలికపై సినిమా హాల్ స్వీపర్ ప్రశాంత్ కన్ను పడింది. 
 
బాలికను మాటల్లోకి దింపి.. నీళ్లు ఇప్పిస్తానంటూ సెల్లార్‌కు తీసుకెళ్లి.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా నోట్లో గుడ్డలు కుక్కి బాత్ రూములో పడేసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్, బోరబండలోని విజేత థియేటర్లో చోటుచేసుకుంది. 
 
ఎంతసేపటికీ బాలిక రాకపోయేసరికి థియేటర్ బాత్రూమ్‌లో బాలిక స్పృహ కోల్పోయి పడివుండటాన్ని గమనించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టామని, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామని పోలీసులు చెప్పారు.