బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (14:42 IST)

హాలీవుడ్ సినిమాను త్రీడి వెర్షన్‌లో చూశాడు.. గుండె ఆగిపోయింది..

హాలీవుడ్ సినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గతవారం రిలీజైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్‌ను త్రీడీ వెర్షన్‌లో చూస్తున్న ఓ ప్రేక్షుకుడు సినిమా థియేటర్లోని మృతి చెందాడు. ఈ ఘట

హాలీవుడ్ సినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గతవారం రిలీజైన హాలీవుడ్ డబ్బింగ్ సినిమా అవెంజర్స్-ఇన్ఫినిటీ వార్‌ను త్రీడీ వెర్షన్‌లో చూస్తున్న ఓ ప్రేక్షుకుడు సినిమా థియేటర్లోని మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు పరిధిలోని శ్రీనివాస్ నగర్‌కు చెందిన బేల్దారీ మేస్త్రీ బాషా, సినీ హబ్ థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్లాడు. 
 
సినిమా ముగిశాక థియేటర్ నుంచి అందరూ వెళ్లిపోయారు. కానీ అతడు మాత్రం సీటుకే పరిమితమయ్యాడు. ఎంతసేపటికీ లేపినా అతను లేవకపోయేసరికి.. థియేటర్ యాజమాన్యం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాషా మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. త్రీడి సినిమాను చూస్తున్న సమయంలో కొన్ని దృశ్యాలు మీదకు వచ్చి పడుతున్నట్లు కనిపించడంతో గుండెపోటుతో మరణించివుండవచ్చునని వైద్యులు తెలిపారు.