మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 1 మే 2018 (12:48 IST)

''మహానటి'' ఆడియోకు ఎన్టీఆర్..

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదలకు ముఖ్య అ

అలనాటి తార సావిత్రి జీవితం ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహానటి. కీర్తి సురేష్‌ టైటిల్‌రోల్‌ పోషిస్తున్నారు. మిక్కీ జె మేయర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదలకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రానున్నట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల మహేష్ బాబు.. భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై సరికొత్త ట్రెండ్ సృష్టించారు. 
 
తాజాగా మహానటి ఆడియో ఫంక్షన్‌కు ఎన్టీఆర్ రానుండటం ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ''మహానటి''ని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సినీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
 
ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాలో సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య కనిపిస్తారని సమాచారం. అయితే ఎన్టీఆర్‌ పాత్రలో ఎవరు కనిపిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ సినీ యూనిట్ వెల్లడించలేదు.