సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 ఏప్రియల్ 2018 (16:12 IST)

''మహానటి'' ఆడియో వేడుక.. ఎప్పుడు? ఎక్కడ?

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అ

కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న సినిమా ''మహానటి''. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా పోస్టర్స్‌, టీజర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో.. మే ఒకటో తేదీన ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలోని నటీనటులంతా కూడా ఈ పాటల వేడుకకు హాజరుకానున్నారు. 
 
ఇప్పటికే అచ్చం సావిత్రి తరహాలో వున్న కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడిపోయాయి. ఇక సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్, షాలిని పాండే తదితరులు నటించిన ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మే 1వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరుగనుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వున్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది.