సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 ఏప్రియల్ 2018 (16:06 IST)

'మహానటి' : మూగ మనసులు లిరికల్ సాంగ్ (వీడియో)

మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ సినిమా నుంచి ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మలయాళ బ్యూటీ కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'మహానటి'. ఈ సినిమా నుంచి ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ .. టీజర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
 
ఈ నేపథ్యంలో తాజాగా 'మూగమనసులు .. మూగమనసులు' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఈ ఇద్దరూ ప్రేమలోపడిన సందర్భంలో ఈ సాంగ్ రానుందని తెలుస్తోంది. 
 
సిరివెన్నెల సాహిత్యం .. మిక్కీ జె. మేయర్ సంగీతం .. శ్రేయా ఘోషల్ స్వరం మనసు తలుపు తట్టేలా వున్నాయి. అద్భుతంగా వేసిన అందమైన సెట్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం వచ్చే నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.