సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 14 ఏప్రియల్ 2018 (14:59 IST)

సావిత్రిని తీసిపెట్టిన కీర్తి సురేష్ : మే 9న 'మహానటి' మూవీ రిలీజ్

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం వచ్చే నెల తొమ్మిదితో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో స

అలనాటి సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మహానటి'. ఈ చిత్రం వచ్చే నెల తొమ్మిదితో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత ఇంకా మరికొంతమంది నటిస్తున్నారు.
 
అయితే, సావిత్రి చిత్రంలో కీర్తి లుక్ ఎలాంటుందోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సావిత్రిగా కీర్తి సురేశ్ ఫస్టులుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. ఈ లుక్‌ను తీక్షణంగా చూస్తే నిజంగానే సావిత్రిలా ఉంది. సావిత్రి ఫోటోకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం గమనార్హం. 
 
సావిత్రి లుక్‌తో కీర్తి సురేష్‌ను సగ భాగం మాత్రమే చూపించినా, ఈ పాత్రకి ఆమె కరెక్టుగా సరిపోయిందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. మరికొంత సేపటిలో ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్‌ను కూడా వదలనున్నారు. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.