వైఎస్ఆర్ గెటప్‌లో అదిరిపోయిన మమ్ముట్టి... "యాత్ర" ఫస్ట్ లుక్ రిలీజ్
దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత, ప్రజానాయుకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చిత్ర వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. "యాత్ర" అనే పేరుతో వచ్చే ఈ చిత్రానికి
దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత, ప్రజానాయుకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చిత్ర వెండితెర దృశ్యకావ్యంగా రానుంది. ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు. "యాత్ర" అనే పేరుతో వచ్చే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్‌లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్‌లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది..' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.